లోటస్ పాండ్‌లో చొక్కా చించుకున్నారు గుర్తులేదా?: బుద్ధా వెంకన్న

  • ఏ చట్టం కింద చంచల్ గూడా జైలుకి తీసుకెళ్లారు? అని జగన్‌ అన్నారు
  • ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు
  • సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు
  • చంద్రబాబు నిన్న ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు
విశాఖ ఎయిర్‌పోర్టులో నిన్న చోటు చేసుకున్న పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్‌ ఇచ్చారు. 'ఏ చట్టం కింద నన్ను చంచల్ గూడా జైలుకి తీసుకెళ్లారు? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ అని లోటస్ పాండ్‌లో చొక్కా చించుకున్నారు గుర్తులేదా? చంద్రబాబు గారు అడిగింది ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడానికి ఏ చట్టం ఉంది అని' అంటూ ట్వీట్ చేశారు.
 
'వైఎస్ జగన్  గారిలా దొంగతనం చేసి దొరికిపోయి ఏ చట్టం కింద జైలుకి తీసుకెళ్తున్నారు? అని అడగలేదు విజయసాయిరెడ్డి. ఆనాడు పెట్టుబడులు రాకుండా ఉత్తరాంధ్రని దెబ్బతియ్యడానికి వెళ్లారు జగన్ గారు. ఇప్పుడు జీఎన్ రావ్ కమిటీ తో అడ్డమైన రాతలు రాయించి పెట్టుబడులు తిప్పి పంపుతున్నారు' అని విమర్శించారు. 

Budda Venkanna
Chandrababu
Vijay Sai Reddy
YSRCP

More Telugu News